Dear Andhra, what is your choice in 2019 for electing ”your” Chief Minister?

References for the post (to be added as in line of credit)

https://www.quora.com/Who-will-win-the-2019-elections-in-Andhra-Pradesh/answer/Praveen-756

https://www.business-standard.com/article/pti-stories/rajan-raises-doubts-about-india-growing-at-7-says-cloud-over-gdp-data-needs-to-be-cleared-119032600779_1.html

ముందుమాట

ఇంతకుముందు జయప్రకాశ్ నారాయణ లాంటి వ్యక్తులు సొంతపార్టీ స్థాపించి పూర్తిగా సంస్కరణల భారతావనిని తీసుకొస్తామని చెప్పి మోడీలాంటివారితో జట్టుకట్టడానికి ఒక వాదన/ నానుడి 2014 సాధారణ ఎన్నికల వాతావరణంలో వుండేది.

అది ఏంటంటే… చదువుకున్నవాడు ఎవడూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యడు. చదువులేనివాళ్లు, పాకిస్తానీ ఏజెంట్లు మాత్రమే కాంగ్రెస్ ని సమర్ధిస్తారు. మరి బీజేపీకి ఎవడు వేస్తాడు? బాగా చదువుకున్నవాడు, డబ్బులు ఆశించనివాడు, నిజమైన అభివృద్ధిని కాంక్షించేవాడు.

నేనిప్పుడు అనేదేమిటంటే… కాంగ్రెస్ స్థాపించిన చదువుల ఫ్యాక్టరీనా? ఆరెస్సెస్ ఊహల ఫ్యాక్టరీనా?

అవసరమైన విషయాలని చూస్తే ఎవరికి ఓటు వేయాలనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎవరికి అనేది వారి వారి  ఇష్టం మీద ఆధారపడుతుంది. కాని నిర్ణయాత్మకమైన ఓటు ఇదీ అని ఎలా తెలుస్తుంది?

ఉదాహరణకి కొన్ని విషయాలని చూస్తే…

కాంగ్రెస్ అనేది అవినీతికరమైన పార్టీ. నీతిబాహ్యమైనది అని 2014 వరకూ చంద్రబాబునాయుడులాంటి అసాధారణ మేధాసంపత్తి, చాకచక్యం, సంపద సృష్టించే వ్యక్తులనబడ్డవాళ్లు (చంద్రబాబునాయుడు సోషల్ మీడియా అభిమానులు) మాట్లాడారు. అప్పుడు ఏ కాంగ్రెస్ అయితే అంటరానిది, మాట్లాడటానికి అర్హతలేనిది, ఇంకా చెప్పాలంటే పనికిమాలినది అయ్యిందో, ఇప్పుడు అదే కాంగ్రెస్ మనకి ఫెడరల్ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కాపాడేది, అలాగే అభివృధ్ధిని అందించే పార్టీ అయ్యింది. ఎలా మారింది ఒక్క అయిదు సంవత్సరాలలో? అరవై సంవత్సరాలు ఏమీ చేయలేదని మాట్లాడినవాళ్లే ఈ అయిదు సంవత్సరాలలో ఏం చూశారు?

పోటీ మొత్తం చంద్రబాబునాయుడుకి, జగన్ కి వున్నట్టే కనిపిస్తుంది. 2014 మాదిరి అయితే వీళ్లిద్దరే పోటీపడితే ఖచ్చితత్త్వం కనిపించుండేది.

చాలా సర్వేలు టీవీ మార్కెట్టులో కనిపించాయి, ఇంకా కనిపించొచ్చు. ఎన్ టీవీ 2014లో సరిగ్గా ఉగాది ముందురోజు సర్వే అని చెప్పి చాలా నియోజకవర్గాలలో జగన్ హవా కనిపిస్తోందనీ, చంద్రబాబునాయుడు చాప చుట్టేసినట్టేనని చెప్పింది. అది కొందరు నమ్మారు కూడా.

 

This entry was posted in Civil Services of India, Politics, ScoopLense and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Unable to load the Are You a Human PlayThru™. Please contact the site owner to report the problem.